- బలగం సినిమాకు భారీ స్పందన
- సర్పంచ్ ఎరవెల్లి విలాస్ రావు అధ్వర్యంలో ప్రదర్శన
మహాదేవపూర్(లోకల్ అప్డేట్స్), ఏప్రిల్ 2 : బంధాలు, బందుత్వాల మధ్య అడ్డు గోడులను తొలగిస్తూ దర్శకుడు వేణు రూపొందించిన “బలగం” సినిమాను జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం అంబట్ పల్లి సర్పంచ్ ఎరవెల్లి విలాస్ రావు ఆదివారం గ్రామపంచాయతీ ఆవరణలో ఉచితంగా ప్రదర్శించారు. ప్రియదర్శ్ హీరోగా,కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించిన ఈ మూవీ గ్రామీణ వాసులను ఆకట్టుకుంటోంది. కొమురయ్య, ఐలయ్య, మొగిలయ్యతో పాటు వారి సోదరి లచ్చవ్వ నటన అంబట్ పల్లి వాసులను కంట తడి పెట్టించింది. గ్రామీణ నేపథ్యంలో తీసిన ఈ సినిమా ఉమ్మడి కుటుంబంలో జరిగే సన్నివేశాలను కండ్లకు కట్టినట్లు చూపించడం, అందులోని ప్రతి సన్నివేశం తమ తమ కుటుంబాల్లో జరిగినట్లుగానే ఉండటంతో కన్నీటి పర్యంతమయ్యారు. ఒకానొక సందర్భంలో ఏడిస్తే ఎవరు ఏమనుకుంటారో అని కొంత మంది చాటుగా వెళ్లి ఎడ్చేశారు. గ్రామంలో సినిమా ప్రదర్శన ఏర్పాటు చేశాడని అంటూ నవ్వుతూ వచ్చి కూర్చున్న గ్రామ ప్రజలు సర్పంచ్ వేసిన సినిమాకు కన్నీటి పర్యంతం అయ్యారు.
కుటుంబ బంధాలు, బందుత్వాల ప్రాధాన్యం సినిమాలో ఉండటంతోనే గ్రామంలో సినిమా ప్రదర్శన చేశామని సర్పంచ్ ఎరవెల్లి విలాస్ రావు పేర్కొన్నారు. ఇలాంటి సినిమాలు ఇప్పుడున్న సమాజానికి ఎంతో అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. బలగం సినిమాకు భారీ స్థాయిలో స్పందన రావడం ఆనందంగా ఉందన్నారు.
ఆర్టికల్ ఫోటో గ్యాలరీ
إرسال تعليق