ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

- మీసేవలో అందుబాటులోకి

- పట్టా పొందేందుకు సువర్ణావకాశం

వెబ్ డెస్క్(లోకల్ అప్డేట్స్), ఏప్రిల్ 02 : ఆక్రమిత ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణకు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఎసైన్డ్, అభ్యంతరం లేని ఇతర ప్రభుత్వ స్థలాలు, అర్బన్ సీలింగ్ ల్యాండ్స్ను అధీనంలో పెట్టుకున్న వారికి, వివిధ సంస్థలకు నిబంధనల మేరకు వాటిపై హక్కులు బదిలీ చేయనున్నారు. 125 చదరపు గజాల లోపు స్థలాలకు పేదలకైతే ఉచితంగా, అంతకన్నా ఎక్కువ విస్తీర్ణమైతే మార్కెట్ ధరకు ప్రభుత్వం క్రమబద్ధీకరించనుంది. ఆక్రమణదారులు 2014 జూన్ 2లోపు సంబంధిత స్థలంలో నివాసం ఏర్పాటు చేసుకుని ఉండాలన్న నిబంధనను ప్రభుత్వం సవరించిన విషయం తెలిసిందే. 2020 జూన్ రెండో తేదీలోపు వారి అధీనంలో ఉన్నట్లు ఆధారాలు చూపాల్సి ఉంటుంది.

 

Post a Comment

Previous Post Next Post