లోకల్ న్యూస్, జాతీయం : దేశవ్యాప్తంగా కరోనా, లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీకి రాహుల్‌గాంధీ లేఖ రాశారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వానికి అండగా ఉంటామని చెప్పారు. దేశంలో సంపూర్ణ లాక్‌డౌన్ వల్ల దినసరి కూలీలసై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపిన రాహుల్...ఆర్థిక కార్యాకలాపాల నిలిపివేతతో మృతుల ప్రభావం పెరిగే అవకాశముందన్నారు. అటు చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకునే యువత గ్రామాల బాట పట్టిన క్రమంలో.. గ్రామీణ ప్రాంతాలకు కరోనా వైరస్ వ్యాప్తించే ప్రమాదం ఉందన్నారు. వృద్దులను కాపాడుకుంటూనే యువకులను హెచ్చరించేలా చర్యలు చేపట్టాలని రాహుల్ పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీని స్వాగతించిన రాహుల్ ఒక మంచి పరిణామమన్నారు. అయితే ఆర్థిక ప్యాకేజిని వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకురావాలన్నారు. జనసాంధ్రత ఎక్కువ ఉన్న చోట ఆస్పత్రులు, వెంటిలేటర్లు ఏర్పాటుచేయాలని కోరారు. లాక్‌డౌన్ చాలా పరిశ్రమలు మూసివేసినందున కార్మికులు ఇబ్బందులు పడకుండా తక్షణ ఆర్థిక సహాకారం అందించాలన్నారు. అటు ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం కొన్ని వారాల తర్వతే తెలుస్తుదని లేఖలో పేర్కొన్న రాహుల్ ఆర్థిక వ్యవస్థ మెరుగుదలకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఈ విషయంలో ప్రభుత్వానికి సహకారం అందిస్తామని చెప్పారు.
Post a Comment